: 'నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్ కోహ్లీ' అంటూ పొగిడిన పాకిస్థాన్ కోచ్!
టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ అభిమానుల జాబితాలో పాకిస్థాన్ కోచ్ కూడా ఉన్నాడు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ ఆటతీరుకు తాను అభిమానినని పాక్ చీఫ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మిక్కీ అర్థర్ తెలిపారు. కోహ్లీ ఆటతీరు అత్యద్భుతమని ఆయన పేర్కొన్నారు. కోహ్లీ అసాధారణ క్రికెటర్ అని ఆయన చెప్పారు. కోహ్లీ బ్యాటింగ్ కు వస్తున్నాడంటే తాను టీవీకి అతుక్కుపోతానని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం అడిలైడ్ లో కోహ్లీ కొట్టిన 141 పరుగుల ఇన్నింగ్స్ తనకు ఇప్పటికీ అలాగే గుర్తుందని ఆయన తెలిపారు. తాను చూసిన క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయేనని ఆయన చెప్పారు.