: గోవాలో రేపటి నుంచి బ్రిక్స్ సమావేశాలు.. హాజరుకానున్న ఐదుదేశాల అగ్రనేతలు.. పెద్ద ఎత్తున భద్రత
గోవా వేదికగా రేపు, ఎల్లుండి జరగనున్న 'బ్రిక్స్' సమాఖ్య (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) 8వ శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఐదు దేశాల అగ్రనేతలు ఆ సదస్సుకు హాజరుకానుండడంతో గోవాలో అత్యాధునిక ఆయుధాలతో కూడిన పోలీసు బలగాలను మోహరించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, మార్గాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు భారత్ వస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. పాక్, భారత్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో బ్రిక్స్ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పాక్‌కు అండగా ఉంటున్న చైనా, భారత చిరకాల మిత్ర దేశం రష్యా ఈ సదస్సులో పాల్గొంటుండడమే అందుకు కారణం.