: భయపడుతున్న చైనా... 'ప్రొడక్టుల బహిష్కరణ'పై ఆందోళనతో హెచ్చరికలు!


ఇండియాలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తే, తమకు వచ్చే నష్టంపై ఆందోళన చెందుతున్న చైనా, దాన్ని ప్రత్యక్షంగా వెల్లడించకుండా, పరోక్ష హెచ్చరికలు చేస్తోంది. తద్వారా తమ వ్యాపారం దెబ్బతింటుందన్న భయాన్ని వ్యక్తం చేసింది. ఇండియాలో తమ ప్రొడక్టులను బహిష్కరించడం ద్వారా ఎలాంటి మేలు జరగక పోగా, ద్వైపాక్షిక వాణిజ్య బంధం దెబ్బతింటుందని హెచ్చరిస్తూ, అధికార 'గ్లోబల్ టైమ్స్' నేడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తమ ఉత్పత్తులను నిషేధించాలన్న ఆలోచన పక్కన బెట్టి, వాణిజ్య లోటును పూడ్చుకోవడంపై దృష్టిని పెట్టాలని, పారిశ్రామిక వృద్ధిని సాధించడం ద్వారా అది సాధ్యమని సలహాలు ఇచ్చింది. రక్షణాత్మక, రాజకీయ ధోరణితో ఆలోచిస్తే, నష్టం ఇండియాకేనని, రెండు దేశాల మధ్యా సంబంధాలు బలహీనపడితే, దాని వల్ల ఇరు దేశాలూ నష్టపోతాయని చెప్పుకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లో చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దని జరుగుతున్న ప్రచారంతో భారతీయుల జేబులు మరింతగా ఖాళీ అవుతాయని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News