: వేద విద్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన రంగనాయకమ్మ
వేదాధ్యయనాన్ని యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. 'ఏం చెప్పాయి వేదాలు?' అంటూ ఆమె రాసిన పుస్తకం సోషల్ మీడియాలో పెద్ద చర్చను లేవదీయడంతో రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు విమర్శలు, ప్రతి విమర్శలతో చిందులు తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, వేదాలు గీర్వాణ భాషలో ఉన్నాయని పండితులు చెబుతుంటారని అన్నారు. ఇప్పుడు ఆ భాష ఎంతమందికి వచ్చు? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు యూనివర్సిటీల్లో వేద విద్యను ప్రవేశపెట్టడం ద్వారా భావి తరాలకు ఏం నేర్పించాలనుకుంటున్నారని ఆమె నిలదీశారు. వేదాలు నేర్చుకున్నవారు పండితులు, పురోహితులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు సంపాదిస్తారు.. వీరంతా బోధించేది ఏంటని ఆమె అడిగారు. పూజలు చేయండి, యజ్ఞాలు, యాగాలు చేయండి. మనుషులను ఐదు విభాగాలుగా విభజించు అని వేదాలు చెబుతాయని, అంతకుమించి వేదాలు ఏం నేర్పుతాయో తనకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.