: 40 మంది ప్రయాణికులతో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం
అదుపుతప్పిన ఓ ఆర్టీసీ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెంలో ఈరోజు చోటుచేసుకుంది. వెంకటాయపాలెం నుంచి గుంటూరుకు బయలుదేరిన సదరు ఆర్టీసీ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను చూసుకోకుండా నడిపించాడని, ఒక్కసారిగా బైక్‌ను చూసి స్టీరింగ్ తిప్పడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు.