: రొట్టెల పండగలో 'ప్రత్యేక హోదా రొట్టె'లను మార్చుకున్న జగన్!


నెల్లూరులో అత్యంత వైభవంగా జరుగుతున్న బారా షాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగకు నేడు వైకాపా అధినేత వైఎస్ జగన్ హాజరై, అమర వీరుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణాల చెరువు వద్దకు వెళ్లి 'ప్రత్యేక హోదా రొట్టె'లను ఆయన మార్చుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం కన్నా తనకు మరో కోరిక లేదని వెల్లడించిన ఆయన, రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో వైకాపా నేతలు ఘన స్వాగతం పలుకగా, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగన్ నెల్లూరు చేరుకున్నారు. జగన్ రాక సందర్భంగా భారీ సంఖ్యలో వైకాపా నేతలు, అభిమానులు దర్గా వద్దకు చేరుకోగా, వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News