: తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం చెప్పుచేతల్లో నడుస్తోంది: కిషన్ రెడ్డి
తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంఐఎంకి భయపడి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల పేర్లను మార్చలేదన్నారు. రాష్ట్రంలో మతం పేరిట విద్యాసంస్థలను నిర్వహించడం సరికాదని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం మద్దతు పలుకుతుందని, దీంతో అధికార పార్టీలు వారికి తొత్తులుగా మారుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.