: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు జరిమానా విధించిన ఐసీసీ


ఆస్ట్రేలియాతో ఇటీవ‌ల జరిగిన ఐదో వన్డేలో ద‌క్షిణాఫ్రికా స్లో ఓవరేట్తో బౌలింగ్ చేసింది. ఈ కార‌ణంగా ఆ జట్టు ఆట‌గాళ్లు అంద‌రూ త‌మ మ్యాచ్ ఫీజు నుంచి జ‌రిమానా స‌మ‌ర్పించుకున్నారు. ఆ జ‌ట్టు కెప్టెన్ డు ప్లెసిస్కు 20 శాతం, ఇతర క్రికెట‌ర్ల‌కు 10 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఇక‌, రానున్న 12 నెలల్లో ఆ జ‌ట్టు మరోసారి ఇదే తీరు క‌న‌బ‌రిస్తే కెప్టెన్‌ ప్లెసిస్ సస్పెన్షన్ ఎదుర్కొనే ప్రమాదంలో ప‌డ్డాడు. మ‌రోవైపు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్కు వ్య‌క్తిగ‌తంగా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. ఆ మ్యాచు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్తో ఆయ‌న దురుసుగా ప్రవర్తించినందుకు గానూ ఈ జ‌రిమానా వేశారు. ఆయన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించి, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాడ‌ని ఐసీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News