: ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యం చేయడం మంచిది కాదు: తలాక్‌పై కేంద్ర మంత్రి వెంకయ్య


ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నట్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ అంశంపై ఈరోజు స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెంకయ్య‌ మాట్లాడుతూ... కామన్‌ సివిల్‌కోడ్ కొత్తగా తీసుకొచ్చింది కాదని స్ప‌ష్టం చేశారు. భార‌త పౌరుల‌ శ్రేయస్సు కోసమే ఈ చట్టమ‌ని అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై స్పందించి తలాక్‌ చెప్పే వ్యవస్థ మంచిది కాదని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ అంశంలో రాజకీయాలు చేయ‌కూడ‌ద‌ని అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో మహిళ‌లు సమాన హక్కులు కలిగి ఉండాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే త‌మ ప్రభుత్వ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. ఈ అంశంపై ప్రధాని మోదీని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదని ఆయ‌న సూచించారు. త‌లాక్ చెప్పే వ్యవస్థను రూపు మాపే దిశ‌గా ప్రజల్లో చర్చ జరగాలని అభిప్రాయ‌ప‌డ్డారు.

  • Loading...

More Telugu News