: మహేష్‌బాబు సినిమా డైలాగ్ గుర్తుకొస్తోంది.. కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టిందట!: లోకేష్‌పై రోజా సెటైర్లు
‘మహేష్‌బాబు సినిమా డైలాగ్ గుర్తుకొస్తోంది.. కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టిందట.. టీడీపీ యువనేత లోకేష్ తీరు చూస్తే అలాగే ఉంది’ అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ఈ రోజు విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల కష్టాలపై పోరాడుతున్న తమ పార్టీ అధినేత జగన్ ముందే లోకేష్ తొడకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. ‘జగన్‌పై లోకేష్ తన స్థాయిని మించి వ్యాఖ్యలు చేస్తున్నాడు. లోకేష్ సిమ్ కార్డులేని సెల్‌ఫోన్‌లా ఉంటాడు. బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ. కనీసం మండల కమిటీని ఎలా నియమిస్తారో కూడా తెలియని లోకేష్ టీడీపీ జాతీయ కార్యదర్శట. కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవని వాడివి.. నిన్ను చూసి జగన్ భయపడాలా?’ అని రోజా ఘాటుగా విమర్శించారు. నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ అందరూ కలిస్తే టీడీపీ గెలిచిందని రోజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోతారని ఆమె జోస్యం చెప్పారు. అసెంబ్లీ నుంచి తనను అన్యాయంగా పంపించేశారని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి తరువాత విదేశాల్లో సెటిలైపోతారని వ్యాఖ్యానించారు. 'కమీషన్లకు ముద్దుబిడ్డ చంద్రబాబు' అని ఆమె అన్నారు. ఆయన పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చీటింగ్‌కు చీర్‌గర్ల్ లాంటి ప్రమోటర్ చంద్రబాబు అని రోజా వ్యాఖ్యానించారు.