: అమెరికాలో గ్లోబల్‌ ఫార్మా ఛైర్మన్‌ పాల్‌ స్టోఫెల్స్‌తో కేటీఆర్‌ భేటీ


అమెరికా నుంచి తెలంగాణ‌కు పెట్టుబ‌డులను తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ దేశంలో రాష్ట్ర‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న ఆయ‌న‌ వాషింగ్టన్‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు న్యూయార్క్‌లో ప‌ర్య‌టిస్తూ అక్క‌డి ఫార్మా కంపెనీల అధినేతలతో, ఫైజర్‌ కంపెనీ ప్రతినిధులతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. రీసెర్చ్‌, అభివృద్ధి, సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ వంటి రంగాల్లో తెలంగాణ‌లో పెట్టుబడుల అవకాశాలపై ఆయ‌న అక్క‌డి అధికారులకు వివ‌రించారు. గ్లోబల్‌ ఫార్మా ఛైర్మన్‌ పాల్‌ స్టోఫెల్స్‌తో కేటీఆర్‌ ప్ర‌త్యేకంగా సమావేశమయ్యారు. ఆయ‌నతో వైద్యోప‌క‌ర‌ణాలు, ఔషధాల తయారీ అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తెలంగాణ‌లో జే ల్యాబ్స్‌ ఏర్పాటుపై ముచ్చ‌టించారు. తెలంగాణ‌కు ఫార్మారంగ పెట్టుబ‌డుల‌పై కేటీఆర్ అధికంగా దృష్టి సారించారు. ఈ రోజు ఆయ‌న‌ సిలికాన్ వ్యాలీలో టి-బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మిన్నెసోట, చికాగోల్లోనూ ఆయ‌న‌ పర్యటిస్తారు.

  • Loading...

More Telugu News