: కేదార్ నాథ్ సమీపంలో 360 అస్థి పంజరాలు!


కాదార్ నాథ్... పరమశివుడి జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ పేరు వింటే గుర్తొచ్చేది మాత్రం మూడేళ్ల క్రితం సంభవించిన ప్రకృతి విపత్తే. అలకనంద, మందాకినీ నదుల మహోగ్రరూపం కేదార్ నాథ్ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. క్షణాల్లో ముంచెత్తుకు వచ్చిన వరద కారణంగా వేలాది మంది మృతి చెందారు. వందలాది మంది ఆచూకీ తెలియలేదు. కనీసం తమ వారి మృతదేహాలైనా కనిపించలేదని వాపోయిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా కేదార్ నాథ్ అటవీ ప్రాంతంలో ఒకే చోట 360కి పైగా అస్థి పంజరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మూడేళ్ల నాటి వరదల్లో గల్లంతైన వారి అవశేషాలే ఇవని భావిస్తున్నట్టు రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ రాఘవ వెల్లడించారు.

  • Loading...

More Telugu News