: థాయ్ రాజు కన్నుమూత.. ఏడు దశాబ్దాలుగా రాజుగా కొనసాగుతున్న భూమిబోల్
సుదీర్ఘకాలంపాటు థాయ్‌లాండ్‌కు రాజుగా కొనసాగుతున్న భూమిబోల్ అతుల్యతేజ్(88) గురువారం కన్నుమూశారు. చక్రి వంశానికి చెందిన ఆయన ఏడు దశాబ్దాలుగా థాయ్ రాజుగా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం డీమోడయాలసిస్ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే సిరిరాజ్ ఆసత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1946లో సోదరుడి మృతితో థాయ్ సింహాసనాన్ని అధిష్టించిన ఆయనను ఆ దేశ ప్రజలు ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. భూమిబోల్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. నేటి కాలానికి చెందిన గొప్ప నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. ఆయనను కోల్పోయిన థాయ్‌లాండ్ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.