: కేసీఆర్.. బస్తీ మే సవాల్ అంటోన్న సీఎం


బయ్యారం గనుల్లో లభ్యమైన ఉక్కు ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తే భూకంపం సృష్టిస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించడం పట్ల సీఎం కిరణ్ దీటుగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయ్యారం కేటాయింపులను రద్దు చేయబోమని తెగేసి చెప్పారు. 'ఏం చేస్తావో చూసుకుంటాం' అని సవాల్ విసిరారు. కేసీఆర్ భూకంపం సృష్టిస్తే, తట్టుకుని అడుగు ముందుకేసే సత్తా తమకుందని సీఎం బదులిచ్చారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో నేడు సీఎం అమ్మ హస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బయ్యారం గనులను తొలుత రక్షణ స్టీల్స్ కు కేటాయించామని, అనంతరం ఆ ఒప్పందాన్ని రద్దుచేసి.. ఏపీఎండీసీ ద్వారా విశాఖలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ కు బయ్యారం ఉక్కు ఖనిజాన్ని కేటాయించామని తెలిపారు.

  • Loading...

More Telugu News