: సెలవు తీసుకున్న భారీ మొసలి
మొసళ్లలో స్టార్ అట్రాక్షన్ గా ఇప్పటి వరకూ జంతు ప్రేమికులను అలరించిన భారీ మొసలిరాజం అనారోగ్యంతో చనిపోయింది. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని.. బునావన్ పట్టణంలో ఆదివారం దీనికి తీవ్ర అస్వస్థత కలగగా వైద్యులు చికిత్స అందించేలోపే కన్నుమూసింది.
దీనిని 2011లో పట్టుకుని బునావన్ పట్టణంలోని టూరిజం పార్కులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. పడిపోయిన ఉష్ణోగ్రతల వల్లే ఇది జరిగిందని భావిస్తున్నారు.
దీనిని 2011లో పట్టుకుని బునావన్ పట్టణంలోని టూరిజం పార్కులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. పడిపోయిన ఉష్ణోగ్రతల వల్లే ఇది జరిగిందని భావిస్తున్నారు.
ఈ మొసలి కోసం పర్యాటకులు బునావన్ కు ప్రత్యేకంగా వస్తుంటారు. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద మొసలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. దీని పొడవు 20 అడుగులకు పైనే!