: అవినీతి ఆరోపణలకు సమాధానమిచ్చుకోలేని స్థితిలో చంద్రబాబు: సి.రామచంద్రయ్య
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇచ్చుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. టీడీపీ నేతలు అవినీతితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతల అవినీతితో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారని ఆయన ఆయన తెలిపారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.