: బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం చేసుకున్న సింధు, శ్రీకాంత్


రియో ఒలింపిక్స్‌ రజతపతక విజేత పీవీ సింధు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన కిడాంబి శ్రీకాంత్ కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) స్పాన్సర్‌ షిప్‌ ఇవ్వనుంది. వీరిద్దరితో బ్యాంక్ ఆఫ్ బరోడా మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి రియో ఒలింపిక్స్‌ కు వెళ్లడానికి ముందే ఈ ఒప్పందాన్ని వారు అంగీకరించినా, ఇది కార్యరూపం దాల్చింది మాత్రం నేడేనని బీవోబీ ప్రకటించింది. దీంతో రానున్న మూడేళ్ల వరకు సింధు, శ్రీకాంత్‌ లు ఆడే జాతీయ, అంతర్జాతీయ జెర్సీలపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లోగో వుంటుంది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరఫున ఆడే మ్యాచ్ లకు మాత్రమే ఇది అమలులో ఉండనుంది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, వందేళ్ల చరిత్ర గల సంస్థతో కలిసి పనిచేసేందుకు గర్వంగా ఉందని చెప్పింది. ఈ ఒప్పందం తనలో కొత్త ఉత్సాహం నింపిందని, మరితం మెరుగైన ప్రదర్శనతో బ్యాడ్మింటన్‌ కు మరింత గుర్తింపు తీసుకొస్తానని శ్రీకాంత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News