: గోరఖ్ పూర్ జైలులో ఖైదీలు, పోలీసుల మధ్య ఘర్షణ
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ జైలులో ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలులోని ఖైదీలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసుల తనిఖీల సమయంలో ఖైదీల వద్ద మొత్తం 130 మొబైల్ ఫోన్లు గుర్తించారు. అయితే, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న సమయంలో ఖైదీలు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పలువురు ఖైదీలతో పాటు పోలీసులకు గాయాలయినట్లు తెలుస్తోంది. ఓ ఖైదీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఖైదీలు ఆరోపిస్తున్నారు.