: తూర్పుగోదావరి జిల్లా పొదలాడలో విషాదం.. లారీ ఢీ కొని అక్కాచెల్లెళ్లు దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లా పొదలాడలో ఈరోజు తీవ్ర విషాదం నెలకొంది. లారీ ఢీకొని అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఇద్దరు బాలికలు ఈ ప్రమాదానికి గురయ్యారు. బాలికల తల్లిదండ్రులు గల్ఫ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం వారిరువురు వారి బంధువుల సంరక్షణలో ఉంటున్నట్లు తెలుస్తోంది. బాలికల మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గల్ఫ్ లోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.