: సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అమెరికా సింగర్, సాహిత్య కారుడు బాబ్ డిలాన్


సాహిత్యంలో 'నోబెల్ బహుమతి-2016'ను ఈ రోజు ప్ర‌క‌టించారు. అమెరికాకు చెందిన గాయకుడు, గేయ ర‌చ‌యిత‌, సాహిత్య కారుడు బాబ్ డిలాన్ (75) కు ఈ ఏడాది ఈ బ‌హుమ‌తి ల‌భించింది. అమెరికా పాట చరిత్రలో ఆయ‌న ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన‌ట్లు నోబెల్ కమిటీ చెప్పింది. పాట ప్రక్రియలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడానికి ఆయన కార‌ణ‌మ‌య్యార‌ని, కొత్తదనానికి ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చార‌ని కొనియాడింది. ఆయ‌న‌ రాసి, పాడిన కొన్ని పాటలు అమెరికాలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయ‌ని పేర్కొంది. ఆయ‌న పాట‌ ‘బ్లోయింగ్ ఇన్ ద విండ్ అండ్ ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పౌర హక్కుల ఉద్యమాలకు ప్రాణం పోసింద‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News