: తిరుపతిలో సందడి చేసిన హీరోయిన్ రెజీనా


చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరంలో ఈరోజు సినీ హీరోయిన్ రెజినా సందడి చేసింది. స్థానిక తీర్థకట్టలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంజీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఆమె చేతుల మీదుగా జరిగింది. తమ ప్రాంతానికి హీరోయిన్ రావడంతో స్థానికులు ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం ఆమె షాపింగ్ మాల్ లో తిరుగుతూ అందులోని చీరలను పరిశీలించారు. ఫొటోలకు పోజులిచ్చి ఉత్సాహంగా గడిపారు.

  • Loading...

More Telugu News