: కూతురు కువైట్‌కు, కుమారుడు అమెరికాకు వెళితే, కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళుతున్నారు: టీడీపీ నేత రావుల
తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగుంటే సర్కారు అప్పులు చేయాలని ఎందుకు యోచిస్తోందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ దివాలా తీసేలా టీఆర్ఎస్ సర్కారు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కువైట్‌కు, కుమారుడు అమెరికాకు వెళితే, కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర ప్రజలకు దిక్కెవరని ఆయన ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూములు కట్టిస్తానని చెప్పిన సర్కారు అందుకోసం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు సీఎం, సీఎస్, డీజీపీలకు మాత్రం వందల కోట్లతో ఇళ్లు నిర్మించారని ఆయన అన్నారు.