: లా కమిషన్ నియమావళిని వ్యతిరేకించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు


లా కమిషన్ రూపొందించిన నియమావళిని ఆల్ ఇండియన్ ముస్లిం లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తీవ్రంగా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనే అంశంపై లా కమిషన్ రూపొందించిన నియమావళిపై ముస్లిం లా బోర్డు నేడు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మూడు సార్లు తలాఖ్ చెప్పడంతో పాటు, ముస్లిం మహిళలకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నావళిని రూపొందించడాన్ని ముస్లిం లా బోర్డు తప్పుబట్టింది. లా కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తే బాగుండేదని... కేంద్రం చెప్పు చేతుల్లో ఉండి మాట్లాడుతోందని ముస్లిం లా బోర్డు చీఫ్ మౌలానా వలి రెహ్మాన్ అన్నారు. మరోవైపు ఇదే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ప్రశ్నావళి ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలంగా ఉందని... పారదర్శకత పాటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News