: ఆ 10 వేల కోట్ల వ్యక్తి బాబు బినామీ అయి ఉంటాడు: జగన్
కేంద్ర ప్రభుత్వానికి నల్లధనం ముట్టజెప్పిన వ్యక్తుల వివరాలు వెల్లడించేది లేదని, వారి వివరాలు రహస్యంగా ఉంటాయని సీబీడీటీ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి పది వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నాడంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని, ఆ వివరాలు చంద్రబాబునాయుడుకి ఎలా తెలిశాయని జగన్ ప్రశ్నించారు. పది వేల కోట్ల రూపాయలు అని కచ్చితంగా లెక్క చెబుతున్నారంటే ఆ నల్లధనం వెల్లడించిన వ్యక్తి ఆయనకు బినామీ అయి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నల్లధనం వెల్లడి విషయంలో జగన్ పై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుండడంతో జగన్ ఎదురుదాడి ప్రారంభించినట్టు కనబడుతోంది.