: నిశ్చితార్థం, అఫైర్ వార్తలపై వివరణ ఇచ్చిన సోనాక్షి సిన్హా


బాలీవుడ్ హీరోయిన్లు నేహాధూపియా, దియా మీర్జా, సమీరారెడ్డితో గతంలో అఫైర్లు నడిపిన వ్యాపారవేత్త బంటీ సచ్ దేవ్ తో తనకు కూడా సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలపై సోనాక్షి సిన్హా వివరణ ఇచ్చింది. తామిద్దరి మధ్య ఎలాంటి అఫైర్ నడవడం లేదని తెలిపింది. అలాగే అతనితో రహస్యంగా నిశ్చితార్థం కూడా జరగలేదని స్పష్టం చేసింది. 'మరి ఈ మధ్యే డిన్నర్ కి వెళ్లినట్టున్నారే' అంటే మాత్రం నవ్వేసింది. ఈ మధ్య ముంబైలో ఓ హోటల్ లో డిన్నర్ ముగించి వస్తూ వారిద్దరూ మీడియా కంటికి చిక్కారు. దీంతో వీరి వ్యవహారంపై దుమారం రేగింది. బంటీ సచ్ దేవ్ పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో అఫైర్లు నడిపి అంబికా చౌహాన్ ను వివాహం చేసుకున్నాడు. తరువాత నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం సోనాక్షితో అఫైర్ నడుపుతున్నాడంటూ వార్తలు వెల్లువెత్తడంతో సోనాక్షి తల్లి చీవాట్లు పెట్టినట్టు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి వయసులో భారీ తేడాపై ఆమె అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News