: ఈ ఏటి స్పెషల్ అమరావతి నిర్మాణ రొట్టె... స్వయంగా మార్చుకోబోతున్న చంద్రబాబు


నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగలో ఈ సంవత్సరం అమరావతి నిర్మాణ రొట్టె ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రసిద్థ బారా షాహిద్ దర్గాలో జరుగుతున్న గంధమహోత్సవం, రొట్టెల పండగ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్వర్ణాల చెరువులో రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణ రొట్టెలను మార్చుకోబోతున్నారు. చంద్రబాబు రాక నిమిత్తం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా, పలువురు రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు చంద్రబాబుతో పాటే అభివృద్ధి, అమరావతి రొట్టెలను పంచుకోనున్నారు. ఇప్పటికే రొట్టెల తయారీదారులు వాటిపై అమరావతి స్ఫురించేలా బుద్ధుడి ముద్రలను వేయించగా, వాటికిప్పుడు ఫుల్ డిమాండ్.

  • Loading...

More Telugu News