: పాకిస్థాన్‌లో దుర్ఘటన.. రైల్లో పేలిన టైం బాంబ్.. 10 మంది మృతి
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్ అదే ఉగ్రవాదంతో సతమతమవుతోంది. పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. రావల్‌పిండి నుంచి క్వెట్టా వెళుతున్న ఓ రైల్లో ఉగ్రవాదులు టైం బాంబ్ అమర్చారు. రైలు బలూచిస్తాన్ ప్రాంతం గుండా వెళుతోన్న సమయంలో బాంబు పేలింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.