: సచిన్ నుంచి అందుకున్న గిఫ్ట్ ను తిరిగిచ్చే ఆలోచన లేదు: దీపా
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా బహుమతి అందుకోవడమే తనకు చాలా ఎక్కువని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తెలిపింది. సచిన్ నుంచి అందుకున్న బీఎండబ్ల్యూ కారును భరించే శక్తి తనకు లేదని, దాన్ని తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నానంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. సచిన్ నుంచి అందుకున్న ఏ గిఫ్ట్ అయినా తనకు చాలా ఎక్కువని... అతని నుంచి అందుకున్న గిఫ్ట్ ను తిరిగిచ్చే ఆలోచన తనకు లేదని స్ఫష్టం చేసింది. ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్ లో మెరుగైన ప్రదర్శనను కనబరిచిన పీవీ సింధు, సాక్షిలతో పాటు దీపకు హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ కార్లను బహూకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్లను సచిన్ చేతుల మీదుగా బహూకరించారు.