: వరంగల్ రూరల్‌లో దీక్షకు దిగిన టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తోన్న తీరుకి ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న టీటీడీపీ నేతలు ఈరోజు వరంగల్ రూరల్‌లో దీక్షకు దిగారు. తెలంగాణ సర్కారు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కలెక్టరేట్ ఎదుట ‘రైతు దీక్ష’ పేరిట ఈ దీక్షను చేపట్టారు. అందులో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదని, మరోవైపు నకిలీ విత్తనాలతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన తెలుపుతున్నారు.