: న్యూజిలాండ్ తో తొలి వన్డేకు దూరమైన రైనా
వైరల్ ఫీవర్ కారణంగా న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డే పోరులో సురేష్ రైనాకు విశ్రాంతిని ఇస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. రైనా కాస్తంత కోలుకున్నాడని, అయినప్పటికీ, మరింత విశ్రాంతి అవసరమన్న దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ తన సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ లో ప్రకటించింది. ఇదే సమయంలో రైనా స్థానంలో మరెవరినైనా జట్టులోకి తీసుకోనున్నారా? అన్న విషయమై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గత సంవత్సరంలో ఇండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన తరువాత రైనా ఇంతవరకూ జట్టుకు ఎంపిక కాలేదన్న సంగతి తెలిసిందే. చానాళ్ల తరువాత న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైనా, తొలి మ్యాచ్ కి దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. కాగా, 16వ తేదీ నుంచి న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.