: ట్రంప్ ను ఎన్నుకోండి... లేదా అణుయుద్ధం తప్పదు: పుతిన్ సన్నిహితుడు జిరినొవ్ స్కీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నే ఎన్నుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడైన వ్లాదిమిర్ జిరినొవ్ స్కీ అమెరికన్లను కోరారు. లేని పక్షంలో అణుయుద్ధం తప్పదని హెచ్చరించారు. రాయిటర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలిగా ఎన్నికైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ఆయన అన్నారు. రష్యన్ 'ట్రంప్'గా జిరినొవ్ స్కీ పేరొందారు. అమెరికా, రష్యాల మధ్య ఇప్పటికే సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయని... యుద్ధం వస్తే అవి మరింత క్షీణిస్తాయని చెప్పారు. భూమి మీద శాంతి నెలకొనాలంటే ట్రంప్ కే ఓటు వేయాలని సూచించారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచంలో ప్రతిచోటా హిరోషిమా, నాగసాకిలే కనిపిస్తాయని అన్నారు.