: అమెరికాలో దుర్మరణం చెందిన ముదినేపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్


అమెరికాలోని పిట్స్ బర్గ్ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వల్లభనేని హరీష్ (42) దుర్మరణం చెందారు. ఈయన కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన వారు. బయటకు వెళ్లేందుకు కారు స్టార్ట్ చేయగా అది స్టార్ట్ కాలేదని... దీంతో బోనెట్ ఎత్తి పరీక్షిస్తుండగా కారు ఒక్కసారిగా ముందుకు దూకిందని... అతడి ఛాతీ మీదుగా కారు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని సమాచారం. కారు ముందు వైపున బాగా డౌన్ ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ దారుణ ఘటన జరగడానికి గంట ముందే అతను ఇండియాలోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడారని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఆయన తల్లిదండ్రులకు నిన్న సాయంత్రం దాటిన తర్వాత అందింది. దీంతో, ముదినేపల్లిలోని హరీష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News