: తదుపరి కార్యాచరణ ఏమిటి?.. కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లో ఐకాస భేటీ
తెలంగాణలో రాజకీయ ఐకాస నిర్వహించాల్సిన తదుపరి కార్యాచరణపై ప్రొ.కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని నాంపల్లి ఐకాస కార్యాలయంలో ఈరోజు పలువురు నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, తాము చేయాల్సిన పనులపై కోదండరాం ఐకాస నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో విద్య, వైద్యం, ఐకాస కమిటీల నిర్మాణంపై చర్చ జరుగుతోంది. మరికాసేపట్లో తమ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై కోదండరాం మీడియాకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.