: అమెరికాలో బిజీబిజీగా తెలంగాణ మంత్రి కేటీఆర్


అమెరికా నుంచి తెలంగాణ‌కు పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ దేశంలో రాష్ట్ర‌ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు ఆయ‌న‌ వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, మిన్నెసోట, చికాగోలో పర్యటిస్తారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు వాషింగ్ట‌న్‌లో ఆయ‌న ప‌లువురు అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సందర్భంగా ప‌లు సంస్థ‌ల అధికారుల‌తో మాట్లాడుతూ వాణిజ్య, వ్యాపార సంబంధాల పెంపునకు సహకరించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. అమెరికాలో భార‌త రాయ‌బారి త‌ర‌ణ్ జీత్ సింగ్‌తో స‌మావేశ‌మైన కేటీఆర్‌.. అమెరికాలో ఉన్న రాష్ట్ర విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. అనంతరం బోయింగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రెసిడెంట్ బెర్ట్రాండ్ మార్క్‌తో ఆయ‌న కాసేపు ముచ్చ‌టించారు. హైద‌రాబాద్ ఏరో స్పేస్ సిటీలోని బోయింగ్ సంస్థ‌కు స‌హ‌కారంపై బెర్ట్రాండ్ మార్క్‌ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఏరో స్పేస్ రంగంలో యువ‌త‌కు శిక్ష‌ణ‌, నైపుణ్యాభివృద్ధిపై ఇరువురి మ‌ధ్య‌ చ‌ర్చ‌లు జ‌రిగాయి. అమెరికా నుంచి తెలంగాణ‌కు ఫార్మారంగ పెట్టుబ‌డుల‌పై కేటీఆర్ సంబంధిత అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. రేపు ఆయ‌న‌ సిలికాన్ వ్యాలీలో టి-బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి సంబంధించి అమెరికా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

  • Loading...

More Telugu News