: నేను నటించిన సినిమాలు టీవీలో వస్తుంటే చూడను.. ఛానెల్ మార్చేస్తా!: ప్రియాంక చోప్రా
అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలను, టీవీ షోలను చూడటానికి అందరూ ఆసక్తి చూపుతుంటే... తాను మాత్రం తన సొంత సినిమాలను చూడనంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు తాను నటించిన సినిమాలు వస్తే వెంటనే ఛానల్ మార్చేస్తానని ప్రియాంక చెప్పింది. "సినిమా సినిమాకి యాక్టర్ గా మెచ్యూర్ అవుతున్నా. అందుకే గతంలో నటించిన నా సొంత సినిమాలను చూడటానికి ఇష్టపడను" అని తెలిపింది.