: 'బాలికలకు వరం.. బంగారుతల్లి పథకం'


రాష్ట్రంలో బాలికల కోసం ఉద్ధేశించిన బంగారుతల్లి పథకాన్నిసీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ఈ ఏడాది మే 1 తర్వాత జన్మించే ఆడపిల్లలకు పుట్టిన వెంటనే రూ. 2500 ఇస్తారు. పుట్టిన రెండేళ్ళ వరకు ఏటా వెయ్యి రూపాయలిస్తారు. ఆ తర్వాత ఐదవ తరగతి వరకూ రూ. 2000.. 6 నుంచి 8వ తరగతి చదివేవరకు రూ. 2500.. 9,10 చదివే బాలికలకు రూ. 3000.. ఇంటర్ చదివే అమ్మాయిలకు రూ. 3,500 అందిస్తారు. చివరగా, డిగ్రీ పూర్తి చేసిన వెంటనే బంగారుతల్లి పథకం ద్వారా అమ్మాయికి లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News