: వీసా గడువు ముగిసినా అమెరికాను వదలని విదేశీయులు.. ఆందోళనలో హోంశాఖ


వీసా గడువు ముగిసినా విదేశీయులు అమెరికా వదిలి వెళ్లకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. అధికారుల తాజా గణాంకాల ప్రకారం వీసా గడువు ముగిసి 2015లో అమెరికాను విడిచి వెళ్లాల్సిన 5,27,127 మంది ఇంకా అమెరికాలోనే ఉన్నారు. అట్లాంటా పట్టణ జనాభా కంటే ఇది చాలా ఎక్కువని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అగ్రరాజ్యంలో అక్రమంగా ప్రవేశిస్తున్న 3,37,117 మందిని సరిహద్దు గస్తీ దళాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది మెక్సికో సరిహద్దు వద్దే అరెస్ట్ అయినట్టు అధికారులు తెలిపారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News