: దేవరగట్టు 'బన్నీ ఉత్సవం'లో 31 మంది తలలు పగిలాయి


కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని దేవరగట్టు బన్నీ ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవంలో 31 మంది తలలు పగిలాయి. క్షతగాత్రులందర్నీ కర్నూలులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. బన్నీ ఉత్సవంలో దేవుడి కోసం మూడు గ్రామాల ప్రజలు కర్రలతో కలబడ్డారు. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు క్షతగాత్రులకు సేవలందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ, గతంలో కంటే ఈసారి బాధితుల సంఖ్య తగ్గిందని అన్నారు. ఈ ఉత్సవంలో హింస లేకుండా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానికుల సహకారంతోనే గతంలో కంటే హింసను తగ్గించగలిగామని అన్నారు. దేవుడు తమ గ్రామానికి వస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే మూడు గ్రామాల ప్రజలు పోటీ పడతారని, ఈ క్రమంలో కొట్టుకుని గాయపడుతుంటారని అన్నారు.

  • Loading...

More Telugu News