: 'ఏంట్రా! పెద్ద సినిమా చేస్తున్నానని చెప్పనేలేదు' అన్నాడు అన్నయ్య: కార్తీ
'కాష్మోరా' సినిమా చేస్తున్నప్పుడే తన అన్న సూర్యకు చెప్పానని, అయితే పెద్ద విజువల్ వండర్ గా, భారీ బడ్జెట్ తో దానిని రూపొందిస్తున్నామని మాత్రం చెప్పలేదని అన్నాడు కార్తీ. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత దానిని చూసి అన్నయ్య (సూర్య)...ఏంట్రా! పెద్ద సినిమా చేస్తున్నానని చెప్పనేలేదు అని నిష్టూరమాడాడని తెలిపాడు. ఆ తరువాత 'బాగుందిరా, చాలా బాగా చేశావు' అని కితాబునిచ్చాడని కార్తీ తెలిపాడు. ఈ సినిమా గ్రాండియర్ గా అభిమానులను అలరిస్తుందని కార్తీ చెప్పాడు. చాలా కాలం తరువాత పెద్ద సినిమా చేశానని కార్తీ తెలిపాడు. ఈ సినిమాలో అన్ని రసాలు ఉండేలా జాగ్రత్త పడ్డామని కార్తీ చెప్పాడు. ఫ్యామిలీతో వెళ్లి ఈ సినిమాను చూసి ఆనందించాలని కార్తీ కోరాడు.