: చైనా స‌హ‌కారం లేక‌పోతే పాక్‌కు ఏ దేశంపైనా యుద్ధం చేసే సత్తా లేదు: ప్రపంచ బలూచ్ మహిళా ఫోరం


పాకిస్థాన్‌కు చైనా నుంచి స‌హ‌కారం లేక‌పోతే ఆ దేశానికి ఏ దేశంపైనా యుద్ధం చేసే సత్తా లేదని బలూచిస్థాన్ స్వాతంత్ర్య‌ ఉద్యమ నాయకురాలు, ప్రపంచ బలూచ్ మహిళా ఫోరం అధ్యక్షురాలు నాయేలా బలూచ్ పేర్కొన్నారు. ఢిల్లీకి వ‌చ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ... పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో భార‌త సైన్యం చేసిన ల‌క్షిత దాడుల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. పాక్‌పైన కూడా అటువంటి దాడులు జ‌ర‌పాల‌ని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంపై కాకుండా మానవ హక్కుల ప‌రిర‌క్ష‌ణ‌, శాంతియుత నిరసనలపై ఆ దేశ‌ జనరల్స్‌కు నమ్మకం లేద‌ని ఆమె పేర్కొన్నారు. త‌మ ప్రాంత ప్ర‌జ‌ల‌పై పాకిస్థాన్ చేస్తోన్న అకృత్యాల‌ను ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు ఖండించాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News