: అద్దంలో చూసుకుంటే కార్తీ కనిపించకూడదని చెప్పాను: కార్తీ


'కాష్మోరా' సినిమా గురించి ఆ చిత్ర కథానాయకుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో విభిన్న తరహా పాత్రలు పోషిస్తున్నానని చెప్పాడు. దర్శకుడు ఈ సినిమాలో రెండు కీలకమైన పాత్రలు ఉన్నాయని చెప్పాడని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఈ పాత్రలకు ఎవరిని ఎంచుకుంటున్నారని అడిగితే... మీరే ఆ పాత్రల్లో నటించాలని చెప్పారని ఆయన తెలిపాడు. దాంతో, రెండు పాత్రలకు ఎలాంటి పోలిక ఉండకూడదని చెప్పానన్నాడు. అద్దం ముందు నిలబడి చూసుకుంటే తనకు కార్తీ కనిపించకూడదని చెప్పానని తెలిపాడు. దీంతో ఆర్ట్ డైరెక్టర్ తో సుమారు 50 మేకోవర్ లు చేశారని అన్నాడు. అందులో గుండుతో ఉన్న గెటప్ ఎంచుకున్నామని, తన పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుందని చెప్పాడు. 'కాష్మోరా' పాత్ర కోసం దర్శకులు నేరుగా మంత్రగాళ్లను కలిశారని, వారి సూచనలతో ఆ పాత్రను రూపొందించామని కార్తీ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News