: రష్యా, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు
రష్యానుంచి పెట్టుబడులను సాధించడంలో భాగంగా విజయవాడలో రష్యా సమాఖ్య పరిశ్రమలు, వాణిజ్య మంత్రి జెనిష్ మ్యాంటురోవ్ ఆధ్వర్యంలో వచ్చిన రష్యా ప్రతినిధుల బృందంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్యా, ఏపీ ప్రభుత్వాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రూ.100 కోట్ల పెట్టుబడితో నౌక నిర్మాణ ప్రాజెక్టుకు అవగాహన ఒప్పందం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు- జేఎస్‌సీయూ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం, ఈడీబీ, టెక్నో నికోల్సన్ గ్రూప్‌ల మధ్య మరో ఒప్పందం కుదిరింది.