: జయలలిత ఆడసింహం: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ


త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో మూడు వారాలుగా చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ సోష‌ల్‌మీడియా ద్వారా స్పందించారు. జయలలిత‌ను ఆడసింహంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అంతేగాక‌, జ‌య‌ల‌లిత‌ను విమర్శిస్తున్న వారు కోతుల్లాంటి వారని ఆయ‌న అన్నారు. త‌మిళ‌నాడు సీఎం త్వ‌ర‌లోనే కోలుకుంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తిరిగి ఆమె త‌మిళ‌నాడులో పాలన కొనసాగిస్తుందని అన్నారు. తాను విద్యార్థిగా ఉన్న‌ సమయంలో జ‌య‌ల‌లిత‌ను అభిమానించేవాడినని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News