: మీరు తినే కోడిగుడ్లు మంచివేనా... చైనా కోడిగుడ్లు వస్తున్నాయ్... జాగ్రత్త!
కేరళలోని కొన్ని ప్రాంతాల్లో చైనా కోడిగుడ్లు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయని అక్కడి మీడియా మొత్తుకుంటోంది. కృత్రిమంగా తయారు చేస్తున్న ఈ కోడి గుడ్లు తింటే ఒళ్లు గుల్లవడం ఖాయమని తెలుస్తోంది. సో... మనం కూడా ఆ డేంజరస్ చైనా ఎగ్స్ గురించి తెలుసుకోవడం మంచిది. వాటిని గుర్తించడం ఎలా? ఆ గుడ్ల లక్షణాలు ఎలా ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం. 1. ఇవి సాధారణ గుడ్లలా కాకుండా గోధుమ రంగులో ఉంటాయి. 2. ఈ గుడ్లు పగిలినప్పుడు ఈగలతో పాటు ఇతర కీటకాలేవి కూడా వాటి వద్దకు రావు. 3. ఈ గుడ్ల ఉత్పత్తి సాధారణ గుడ్ల ఉత్పత్తి కంటే చాలా చీప్. 4. గుడ్డు పగలగొట్టిన కాసేపటికే తెల్లసొన, పచ్చసొన వాటంతట అవే కలిసిపోతాయి. సాధారణ గుడ్డులోని సొనలు కలవవు. వేటికవే వేరుగా ఉంటాయి. ఫేక్ గుడ్డులోని పచ్చ సొన, తెల్ల సొనలు రెండూ ఒకే పదార్థంతో తయారు చేయడమే దీనికి కారణం. 5. సాధారణ గుడ్డు కంటే చైనా గుడ్డు పెంకుకు మెరుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది. 6. ఈ ఫేక్ గుడ్లను తాకినప్పుడు సాధారణ గుడ్ల కంటే ఇవి కొంచెం గరుకుగా అనిపిస్తాయి. 7. చైనా గుడ్లను చెవి దగ్గర పెట్టుకుని చిన్నగా ఊపితే, అందులో నుంచి శబ్దం వినిపిస్తుంది. గుడ్డులోని గట్టి పదార్థం నుంచి నీరు వెలుపలికి రావడమే దీనికి కారణం. 8. గుడ్డును చిన్నగా కొట్టినప్పుడు సాధారణ గుడ్డు కంటే దీని శబ్దం కొంచెం తక్కువగా ఉంటుంది. 9. మనం ఎగ్ ఫ్రై చేసేటప్పుడు పచ్చ సొనను పగలగొడితే తప్ప అది స్ప్రెడ్ కాదు. కానీ, చైనా గుడ్డును ఫ్రై చేసేటప్పుడు మనం కలపక పోయినా పచ్చ సొన స్ప్రెడ్ అవుతుంది.