: శ్రీకాకుళంలో స్కార్పియో వాహనం బీభత్సం.. ఇద్దరి మృతి
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఈ రోజు ఓ స్కార్పియో వాహనం రోడ్డుపై బీభత్సం సృష్టించింది. మండలంలోని బూరవల్లిలో పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలోని వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలేసి, పారిపోయాడు. ఆగ్రహించిన స్థానికులు స్కార్పియోను దగ్ధం చేశారు. ప్రమాదం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.