: ఇటీవల సైన్యం ఎనిమిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది: మనోహర్ పారికర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత సరిహద్దు ప్రాంతాలు భద్రంగా ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈ రోజు ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో 15 కిలోమీటర్ల పరిధిలో ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందని ఆయన తెలిపారు. సైన్యం ఎనిమిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌లో కనీసం 35 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. భారత్ అనుసరిస్తోన్న శాంతియుత విధానాన్ని బలహీనతగా చూడకూడదని చెప్పారు.