: లండన్ లోని పాక్ హైకమిషన్ ముందు నిరసన... నినాదాలతో హోరెత్తించిన బలూచిస్థాన్ వాసులు


పాకిస్థాన్ లో అంతర్భాగాలుగా ఉన్న బలూచిస్థాన్, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఆ దేశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతాల్లో అరాచకాలను ఆపాలని, మానవహక్కులను హరించడం నిలిపివేయాలంటూ నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో వారు తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో, లండన్ లోని పాకిస్థాన్ హైకమిషన్ ముందు గిల్గిత్, బలూచిస్థాన్, ఆక్రమిత కశ్మీర్ లలో పాక్ అరాచకాలకు స్వస్తి పలకాలంటూ బలూచిస్థాన్ వాసులు ఆందోళన చేశారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాక్ ప్రభుత్వం వెంటనే అరాచకాలను ఆపాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News