: నా రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు: పంకజా ముండే
మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే రాజీనామాకు సిద్ధపడ్డారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారని... పదేపదే తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తన లేత భుజాలపై బాధ్యతలను మోశానని... తనను ఎంత వరకు టార్గెట్ చేస్తారని ప్రశ్నించారు. తనమీద అవినీతి ఆరోపణలు చేశారని... మరొకరేమో తాను బెదిరించానని ఆరోపించారని... కొందరేమో తనను గూండా అంటున్నారని... అయినా, ఎవరూ ఏదీ నిరూపించలేక పోయారని తెలిపారు. తన పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నారని... పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోతున్నానని ఆమె వాపోయారు.