: చెన్నైలోని సత్తూరు నుంచి విరుధన‌గ‌ర్ వెళుతున్న బ‌స్సులో కాల్పుల క‌ల‌కలం


చెన్నైలోని సత్తూరు నుంచి విరుధన‌గ‌ర్ వెళుతున్న బ‌స్సులో ఈరోజు కాల్పుల క‌ల‌కలం చెలరేగింది. కోయంబత్తూరుకు చెందిన క‌ర‌ప్పుస్వామి అనే యువ‌కుడు ఆర్టీసీ బస్సులో వెళుతున్నాడు. ఆ బస్సుని వెంబడించిన ముగ్గురు దుండగులు అతడిపై దాడి చేయాలని చూశారు. ముగ్గురిలో ఒకరు బస్సులోకి ప్రవేశించి కరప్పుస్వామిని తుపాకీతో కాల్చి చంపేశారు. మృతుడి వ‌య‌సు 25 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. కాల్పుల త‌రువాత దుండ‌గులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యార‌ని చెప్పారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  • Loading...

More Telugu News