: ఇక 11 అంకెల ఫోన్ నంబర్... త్వరలోనే అమలు చేయనున్న కేంద్రం
త్వరలో మీ ఫోన్ నంబర్ ముందు మరో అంకె వచ్చి చేరనుంది. శరవేగంగా పెరుగుతున్న టెలికం రంగంలో 10 అంకెల సంఖ్యల లభ్యత తగ్గుతుండటంతో, మరో అంకెను చేర్చి 11 అంకెల నంబరింగ్ వ్యవస్థను తీసుకురావాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (డాట్) నిర్ణయించింది. అతి త్వరలో ఈ నిర్ణయం అమల్లోకి రానుందని సమాచారం. వాస్తవానికి ఇప్పుడున్న 10 అంకెల విధానం 2003 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విధానాన్ని 30 సంవత్సరాలపాటు అమలు చేయవచ్చని అప్పట్లో ప్రభుత్వం భావించగా, టెలికం వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నంబరింగ్ వ్యవస్థను మరోమారు మార్చాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.